Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో ఘనంగా ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 04:47 PM

నారాయణఖేడ్‌లో ఘనంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవం

02-10-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్ వద్ద శుక్రవారం సంఘం జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1998 అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళితుల సమస్యల పరిష్కారం, ఆత్మగౌరవం, సమానత్వం, కుల వివక్ష నిర్మూలన లక్ష్యాలతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిందన్నారు. సంఘం ఏర్పడిన నాటి నుంచి దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అసమానతలపై నిరంతరం పోరాటాలు చేస్తూ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తోందన్నారు. దళితులపై కొనసాగుతున్న వివక్షను గుర్తించేందుకు సర్వేలు నిర్వహించి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు జరిగిందన్నారు. దళితుల హక్కుల సాధన కోసం సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు బి. కన్షీరాం,అంబేద్కర్ పూలే సేవా సమితి డివిజన్ అధ్యక్షులు ఎస్. నర్సింలు, ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంఘం యువజన అధ్యక్షులు సంతోష్, సీఐటీయూ జిల్లా నాయకులు రమేష్, మైనారిటీ సంఘం డివిజన్ అధ్యక్షులు మనోద్దీన్ కుర్షిత్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు ఎస్. గణపతి, అరుణ్, గౌతం, రామప్ప, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో ఘనంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News