Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో ఘనంగా 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్' నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 08:24 AM

నారాయణ స్కూల్లో ఘనంగా 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్'

01-10-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హైస్కూల్‌లో 'ఈ-ఛాంప్స్' 1, 2వ తరగతుల విద్యార్థులకు రెండవ రోజు 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్' (SLC) కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకతను, దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

​గడిచిన మూడు నెలల కాలంలో తాము నేర్చుకున్న విద్యా విషయాలను ఒక 'సైన్స్ ప్రెయర్' రూపంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో స్వయంగా వివరించి ఆకట్టుకున్నారు. చిన్నారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్) పెంచడం, నాయకత్వ లక్షణాలను అలవర్చడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రతినిధులు పేర్కొన్నారు. పిల్లలు ధైర్యంగా విషయాలను వివరిస్తుంటే తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవనీత, ఈ-ఛాంప్స్ కోఆర్డినేటర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి, డీన్ వెంకన్న, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ స్కూల్లో ఘనంగా 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News