Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 04:11 PM

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
23-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాత్రూమ్‌ వెనుక యువతి మృతదేహం.. ఒంటిపై గాయాలు

పక్కింటి వ్యక్తిపై మృతురాలి తల్లి ఆరోపణ.. పోలీసుల దర్యాప్తు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామానికి చెందిన హరిణి (18) ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో నర్సింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. సెలవుల నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చింది. తండ్రి మృతి చెందడంతో తల్లి రాజేశ్వరి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ఈ క్రమంలో హరిణి ఇటీవల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె కనిపించకపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించారు. చివరకు ఇంటి ఆవరణలోని బాత్రూమ్‌ వెనుక ఒంటిపై గాయాలతో హరిణి మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, తన కుమార్తె మృతికి పక్కింటికి చెందిన వ్యక్తి కారణమై ఉండొచ్చని తల్లి రాజేశ్వరి పోలీసులకు ఆరోపించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా హరిణి మృతి కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Sthanikam

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News