Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

నల్లగొండలో సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం

నల్లగొండలో సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం

నల్లగొండలో సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం
06-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలోని సాగర్ రోడ్‌లో డాన్ బాస్కో కళాశాల పక్కన 11 ఎకరాల్లో నిర్మితమైన “సురభి హౌసింగ్ కాలనీ”ను ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం లేఅవుట్‌ను మేనేజింగ్ డైరెక్టర్లు మొహమ్మద్ బషీరుద్దీన్, మొహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని కాలనీ యాజమాన్యం సన్మానించింది.

టిటిసిపి, ఆర్ఈఆర్‌ఏ అనుమతులతో రూపొందిన ఈ లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, పార్కులు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నల్లగొండ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాణ్యమైన నివాస ప్రాజెక్ట్‌గా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రారంభ దశలోనే ప్లాట్లకు ఊహించని డిమాండ్ నెలకొంది. బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టగా, పలువురు ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పెట్టుబడిదారులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా, భవిష్యత్తులో విలువ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బండారు ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆమెర్, వంగూరి లక్ష్మయ్య, మహమ్మద్ అజీమ్ ఉద్దీన్, సైఫ్ ఉద్దీన్, చిన్నాల జానయ్య, సైదులు తదితరులు, నల్లగొండ పుర ప్రముఖులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో సురభి హౌసింగ్ కాలనీ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News