Sthanikam - Truth Matters
Logo

నల్గొండ బిఆర్ఎస్ మేయర్ అభ్యర్థి గా చకిలం వసంత అనిల్ కుమార్

Updated : 29 Jan 2026 17:01 IST
As Preferred Source 1 min read
నల్గొండ బిఆర్ఎస్ మేయర్ అభ్యర్థి గా చకిలం వసంత అనిల్ కుమార్

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వసంత పేరును ఖరారు చేసింది. సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ సతీమణి అయిన వసంతకు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ నల్లగొండ రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకుంది.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో వసంత మేయర్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఉద్యమ నేపథ్యం, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా వసంతకు అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

దివంగత చకిలం శ్రీనివాసరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అనిల్ కుమార్ కుటుంబం నల్లగొండ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అదే క్రమంలో వసంత అభ్యర్థిత్వం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

వసంత 48వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు. మేయర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నల్లగొండ మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు జిల్లాలో రాజకీయంగా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sthanikam

నల్గొండ బిఆర్ఎస్ మేయర్ అభ్యర్థి గా చకిలం వసంత అనిల్ కుమార్

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news