Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 09:02 PM

నల్గొండలో వైభవంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం...

22-09-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండలో వైభవంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం...

విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాల...

నైతిక విలువలు నేర్పించాలి...కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండ : విద్యార్థులను సన్మార్గంలో నడిపి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి, ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగంలో నల్గొండ జిల్లా ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. గత ఏడాદితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నమోదు శాతం 10 శాతం తగ్గగా, ఒక్క నల్గొండ జిల్లాలోనే 9 శాతం పెరగడం ఇక్కడి టీచర్ల నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ కొందరు ప్రైవేటువైపు మొగ్గు చూపుతున్నారని, బట్టీ విధానం, ఆంగ్ల మాధ్యమ ప్రభావమే దీనికి కారణమని విశ్లేషించారు. దీన్ని మార్చేందుకు ఉపాధ్యాయులంతా కృషి చేయాలన్నారు.

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాల...

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నల్గొండలో రూ.200 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయన్నారు. ఇటీవల 12 వేల మంది కొత్త ఉపాధ్యాయులను నియమించామని, అవసరమైతే మరికొందరిని తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు నేర్పించాలని, టెన్త్ తర్వాత ఇంటర్‌లో ఫెయిలవుతున్న వారిపై, బడిమానేసిన (డ్రాపౌట్స్) పిల్లలపై ప్రత్యేక విశ్లేషణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి.. కలెక్టర్ బి.చంద్రశేఖర్

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వల్ల విద్యార్థులు దారితప్పే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం సమీక్షించుకుంటూ పిల్లలలో నైతిక విలువలు, సృజనాత్మకతను పెంపొందించాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో విద్యార్థుల సంఖ్య 2,000 పెరిగిందని, విద్యాభివృద్ధి కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులతో పాటు ఆన్‌లైన్ బోధనను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 5న సీఎం నకిరేకల్ పర్యటన ఉన్నందున, ఆ రోజు జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కుల కంటే సమాజంలో గౌరవంగా బతికే నైతిక విలువలు నేర్పడం ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ చదువుతోనే జీవితాల్లో వెలుగులు నిండుతాయనగా, మరో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు వృత్తికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో గురువుల పాత్ర కీలకమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి (DEO) సుసింధర్ రావు నివేదిక సమర్పిస్తూ.. జిల్లాలోని ఉపాధ్యాయులు పాఠశాల వేళల కంటే ప్రతిరోజూ అదనంగా గంటన్నర సమయం కేటాయించి పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కార్పొరేటర్ గుమ్మల జానకి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో వైభవంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News