పారిశుధ్య కార్మికులతో కలిసి మురుగు కాల్వను శుభ్రం చేసిన చైర్‌పర్సన్
షాదీఖానా నాలాలో వ్యర్థాల తొలగింపు.. పరిశుభ్రతే లక్ష్యంగా శ్రమదానం
పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛత హీ సేవా 2026’ కార్యక్రమంలో భాగంగా, మున్సిపల్ పరిధిలోని నాగులకుంట సమీపంలో ఉన్న షాదీఖానా నాలాలో గురువారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శ్రమదానంలో చైర్‌పర్సన్ స్వయంగా పాల్గొని క్షేత్రస్థాయిలో కార్మికులతో కలిసి పనిచేస్తూ వారిని ఉత్సాహపరిచారు. నాలాలో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్తాచెదారం, ఘన వ్యర్థాలను తొలగించి, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రజలంతా ఇళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్ర ప్రాంతాల సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల దాసు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్ నరసింహ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ స్వప్న, సుధీర్, స్థానికుడు బీఎస్‌ఎన్‌ఎల్ నరసింహ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి