భువనగిరి పట్టణంలోని స్థానిక 23వ వార్డుకు చెందిన పల్లెర్ల అండాలు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత-జహంగీర్,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మృతుడికి నివాళులర్పించి, దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందజేశారు.ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొంటూ,కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈకార్యక్రమంలో వార్డు పెద్దలు కరకాల పోచయ్య, బర్రె సుదర్శన్,ఇటుకల స్వామి,బర్రె క్రాంతి,పల్లె రమేష్ పార్థివ దేవానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్టు - జి.శ్రీనివాస్ .✍️
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి