చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలాధారణ భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.స్వర్గీయ మన్నే మాధవరెడ్డి, స్వర్గీయ పాటి సత్యనారాయణ రెడ్డి, స్వర్గీయ పాటి అరుణ గార్ల జ్ఞాపకార్థం మన్నే కృష్ణారెడ్డి - లాస్యశ్రీ దంపతులు, వారి కుమారులు మన్నే అక్షిత్ రెడ్డి, మన్నే యోగేష్ రెడ్డిలు దాతలుగా వ్యవహరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. తమ కుటుంబంపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, తాము తలపెట్టిన కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షులు కాంసెట్టి భాస్కర్ గురుస్వామి, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, గురుస్వాములు కంచరకుంట్ల వెంకటరెడ్డి, మలిగే శ్రీను, గుండెబోయిన అంజయ్య, స్వాములు ఉప్పు ఆంజనేయులు, తాడూరు పరమేష్, చింతల సుధాకర్ రెడ్డి, సుక్క సుదర్శన్, యు.నాగరాజు, పాలమాకుల అశోక్, ఇమ్మడి ఈశ్వర్, ఓర్సు రాజు, పస్తం చిన్ని కృష్ణ, కన్నె స్వాములు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బండమీది మల్లేష్ తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి