Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

తాజ్‌పూర్‌ గ్రామంలో రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

Updated : 20 Nov 2026 20:43 IST
As Preferred Source 1 min read
 తాజ్‌పూర్‌ గ్రామంలో రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

తాజ్‌పూర్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

రూ.5 లక్షల బీమా కోసం గ్రామ ప్రజలకు సర్పంచ్ దంపతుల విజ్ఞప్తి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తాజ్‌పూర్ గ్రామంలో నేటి నుండి అనగా నవంబర్ 21న ప్రారంభించనున్నట్లు సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ దంపతులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దంపతులు కోరారు.

Sthanikam

తాజ్‌పూర్‌ గ్రామంలో రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

Article Image

తాజ్‌పూర్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

రూ.5 లక్షల బీమా కోసం గ్రామ ప్రజలకు సర్పంచ్ దంపతుల విజ్ఞప్తి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తాజ్‌పూర్ గ్రామంలో నేటి నుండి అనగా నవంబర్ 21న ప్రారంభించనున్నట్లు సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ దంపతులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దంపతులు కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news