Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

మానూర్‌లో కార్మిక సంఘం వైపు అడుగులు.. 55 మందికి గుర్తింపు కార్డుల పంపిణీ

Updated : 20 Nov 2026 19:49 IST
As Preferred Source 1 min read
మానూర్‌లో కార్మిక సంఘం వైపు అడుగులు.. 55 మందికి గుర్తింపు కార్డుల పంపిణీ

సంగారెడ్డి జిల్లా మానూర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు చెందిన సుమారు 55 మంది గ్రామపంచాయతీ కార్మికులు కార్మిక సంఘాల సమన్వయ కేంద్రం (టీయూసీసీ)లో చేరారు.ఈ సందర్భంగా నూతనంగా సంఘంలో చేరిన కార్మికులకు నాయకులు గుర్తింపు కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీయూసీసీ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు కనీస వేతనాలు అందించడం, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగుల బీమా, భవిష్య నిధి వంటి సౌకర్యాలు కల్పించడం కోసం తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దయానంద్, మహిపాల్, ప్రమోద్, అంజి, రాములు, బాలయ్య, మాణిక్యం, దావీద్, ప్రవీణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానూర్‌లో కార్మిక సంఘం వైపు అడుగులు.. 55 మందికి గుర్తింపు కార్డుల పంపిణీ

Article Image

సంగారెడ్డి జిల్లా మానూర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలకు చెందిన సుమారు 55 మంది గ్రామపంచాయతీ కార్మికులు కార్మిక సంఘాల సమన్వయ కేంద్రం (టీయూసీసీ)లో చేరారు.ఈ సందర్భంగా నూతనంగా సంఘంలో చేరిన కార్మికులకు నాయకులు గుర్తింపు కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీయూసీసీ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు కనీస వేతనాలు అందించడం, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగుల బీమా, భవిష్య నిధి వంటి సౌకర్యాలు కల్పించడం కోసం తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దయానంద్, మహిపాల్, ప్రమోద్, అంజి, రాములు, బాలయ్య, మాణిక్యం, దావీద్, ప్రవీణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news