యాదాద్రి బోనగిరి :జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ.జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి శ్రీమతి వి. మాధవి లత రాయిగిరి లోని సహృదయ వయో వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని వయో వృద్ధులతో మాట్లాడి వారి సంక్షేమం, కావాల్సిన న్యాయ సహాయం అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలోని కొంత మంది అర్హులైన వారికి పెన్షన్స్ నమోదు చేయించుటకు తగు చర్యలు తీసుకుంటామని, మానసిక వికలాంగులకు సరైన వైద్యం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుండి లభిస్తుందని మరియు వారి కుటుంబాల చిరునామాలు సేకరించటానికి సంబంధిత శాఖలను కోరడమైనదని తెలిపి వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యానికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం మేనేజర్ రఫి, వయో వృద్దులు పాల్గొన్నారు.
రాయిగిరి లోని సహృదయ వయో వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ.జయరాజు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి