కార్తీకమాసంలో శివమాలధారులకు అన్నప్రసాద వితరణ.
భక్తితో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎరుకల సంధ్యా రాందాస్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల శ్రీ మోక్ష లింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా శివమాల స్వీకరించిన శివస్వాములకు ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో శివస్వాములకు అన్నప్రసాదం అందజేశారు.ఈ సందర్భంగా ఎరుకల సంధ్య రాందాస్ గౌడ్ మాట్లాడుతూ.. శివమాల ధరించి భక్తితో దీక్ష చేపట్టిన శివస్వాములకు అన్నదానం చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆ పరమశివుడే తనకు ఈ పవిత్రమైన సేవ చేసే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఎంతో గొప్ప సేవ అని, ముఖ్యంగా కార్తీకమాసంలో శివస్వాములకు అన్నదానం చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.భగవంతుడి ఆశీస్సులతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఎరుకల సంధ్యా రాందాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి ఆదిమూలం శంకర్, వీరమల్ల దాసు గౌడ్, గోగులోతు శంకర్ నాయక్, పోయిని నరసింహ యాదవ్, దోర్నాల గజేందర్, ముప్పిడి కృష్ణ, నరసింహ ఎల్ఐసి, కందగట్ల శ్రీను, పున్న శివ, భీమన గోని బాల శివ తదితరులు పాల్గొన్నారు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి