Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: యువకుడి దుర్మరణం

Updated : 20 Nov 2026 19:01 IST
As Preferred Source 1 min read
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: యువకుడి దుర్మరణం

ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని బొలెరో డ్రైవర్‌ మృతి

చౌటుప్పల్‌ శివారులో తెల్లవారుజామున ఘటన

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్‌ పట్టణ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా షాహ్‌గంజ్‌కు చెందిన రోహిత్‌ రవి రట్టే (19) హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నాడు. ఇతను తన బంధువు పవన్‌ రట్టేతో కలిసి ముంబై నుంచి విశాఖపట్నానికి బొలెరో వాహనంలో ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల సమయంలో చౌటుప్పల్‌ దాటిన తర్వాత గంగోత్రి వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ సమీపంలో విజయవాడ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ అజాగ్రత్తగా బొలెరో వాహనాన్ని కుడివైపున బలంగా ఢీకొట్టింది.​ఈ ప్రమాదంలో బొలెరో నడుపుతున్న రోహిత్‌ వాహనం నుంచి రోడ్డుపై పడిపోగా, ఆయిల్‌ ట్యాంకర్‌ అతని తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్కనే కూర్చున్న పవన్‌ రట్టే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.​సమాచారం అందుకున్న చౌటుప్పల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ను రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కందాడ కృష్ణ (37)గా గుర్తించారు. మృతుడి బంధువు ప్రేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: యువకుడి దుర్మరణం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news