Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

పేదల కష్టాల్లో తోడుగా ఫౌండేషన్.. అనుషమ్మ కుటుంబానికి ఆర్థిక భరోసా

Updated : 20 Nov 2026 19:00 IST
As Preferred Source 1 min read
పేదల కష్టాల్లో తోడుగా ఫౌండేషన్.. అనుషమ్మ కుటుంబానికి ఆర్థిక భరోసా

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా జీఎంఆర్ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా కల్హేర్ మండలం మిర్కన్‌పేట్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పొన్న అనుషమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ తరఫున సహాయం అందించారు. ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు అనుషమ్మ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాములు, మాజీ వార్డు సభ్యుడు సాయిలు, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ సాగర్, బొక్క సాయిలు, పొన్న సాయిలు, బొక్క చిన్న సాయిలు, బొక్క రాములు, అవిటి సాయిలు, కుమ్మరి భూమయ్య, కూలి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. గుఱ్ఱపు మచ్చేందర్ నాయకత్వంలో సేవే లక్ష్యం.. నిరుపేదలకు అండగా నిలవడమే ధ్యేయం అనే నినాదంతో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రజాసేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

Sthanikam

పేదల కష్టాల్లో తోడుగా ఫౌండేషన్.. అనుషమ్మ కుటుంబానికి ఆర్థిక భరోసా

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి