Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బాలికల భద్రత, చట్టాలపై అవగాహన లక్కారం సాంజన్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేక సదస్సు

Updated : 20 Nov 2026 19:59 IST
As Preferred Source 1 min read
బాలికల భద్రత, చట్టాలపై అవగాహన లక్కారం సాంజన్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేక సదస్సు

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

ప్రతి బాలికకు సమాన అవకాశాలు, సురక్షిత వాతావరణం కల్పించడానికి సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని అధికారులు, వక్తలు పిలుపునిచ్చారు.​మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జస్ట్‌ రైట్స్‌, స్కోప్‌ ఎన్జీవో, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలోని సంజన్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌), బాలకార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్‌ నంబర్ల గురించి వివరించారు. అనంతరం టోల్‌ఫ్రీ నంబర్ల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.​కార్యక్రమంలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ హబ్‌ ప్రతినిధి భార్గవి, పాఠశాల ప్రిన్సిపాల్‌, షీ టీం సభ్యుడు రవీందర్‌ రెడ్డి, బృందం సభ్యులు, స్కోప్‌ మండల కోఆర్డినేటర్‌ బి. నరసింహ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికల భద్రత, చట్టాలపై అవగాహన లక్కారం సాంజన్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేక సదస్సు

Article Image

చౌటుప్పల్‌ స్థానికం ప్రతినిధి:

ప్రతి బాలికకు సమాన అవకాశాలు, సురక్షిత వాతావరణం కల్పించడానికి సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని అధికారులు, వక్తలు పిలుపునిచ్చారు.​మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జస్ట్‌ రైట్స్‌, స్కోప్‌ ఎన్జీవో, షీ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలోని సంజన్ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌), బాలకార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్‌ నంబర్ల గురించి వివరించారు. అనంతరం టోల్‌ఫ్రీ నంబర్ల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.​కార్యక్రమంలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ హబ్‌ ప్రతినిధి భార్గవి, పాఠశాల ప్రిన్సిపాల్‌, షీ టీం సభ్యుడు రవీందర్‌ రెడ్డి, బృందం సభ్యులు, స్కోప్‌ మండల కోఆర్డినేటర్‌ బి. నరసింహ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news