ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ వసంత నగేష్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ పద్మశాలి కాలనీవాసుల లోవోల్టేజీ కష్టాలు తీరాయి. కాలనీలో గత కొంతకాలంగా విద్యుత్ లోవోల్టేజీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీవాసుల అవస్థలను గుర్తించిన గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ ఇటీవల ఈ సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేవలం పది రోజుల్లోనే కాలనీకి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు. శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ సతీష్, మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య, వార్డు సభ్యురాలు పాలమాకుల కవిత నర్సింగ్, మాజీ ఉప సర్పంచ్ పాలమాకుల యాదయ్య, గీత సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేష్, పాలమాకుల నరసింహ, వార్డు సభ్యులు చప్పిడి సంజీవ రెడ్డి, గుర్రం ప్రమోద్ కుమార్, పబ్బు మహేష్, బాండ్లపల్లి రాజు, గుండు రాజు, జి. సురేష్, సీహెచ్ లింగస్వామి, పబ్బు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి