Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Updated : 20 Nov 2026 19:28 IST
As Preferred Source 1 min read
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల వివరాల నమోదు కార్యక్రమం సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 20వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ షజ్జీ, కోఆప్షన్ సభ్యుడు మునిపల్లి సత్యనారాయణ తదితరులు నమోదు కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు పథకం వివరాలను వివరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే 3వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు అధ్యక్షతన నిర్వహించిన నమోదు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (ACLB) పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు మాట్లాడుతూ పట్టణంలోని పేద కుటుంబాలన్నీ ఈ పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా సంబంధిత వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన పనులను చేపట్టాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ వివరాలతో సంబంధిత వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ధృవీకరణ సందేశం పంపిస్తారని తెలిపారు. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలు ఈ పథకంపై అవగాహన పెంచుకొని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలని ప్రజాప్రతినిధులు, అధికారులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news