నెలల తరబడి పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. తాగునీటి వృథాతో పాటు ప్రమాదాలకు కారణం.
చిట్యాల: అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వేణుగోపాలస్వామి వెంచర్ కాలనీలో తాగునీటి పైప్‌లైన్ పగిలి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఓ కారు నీటి గుంతలో దిగబడింది. నిరంతర నీటి లీకేజీతో రోడ్డుపై భారీ గుంత ఏర్పడగా, శుక్రవారం ఆ మార్గంలో వెళ్తున్న కారు అందులో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పైప్‌లైన్ నుంచి రోజూ వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి