-భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి పట్టణంలోని 18, 35, 6, 7వ వార్డులకు సంబంధించి నెహ్రూ-కెన్నెడీ పార్కులో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటుతో పాటు ఆర్థికంగా కూడా పెద్ద సమస్యగా మారుతుందని,అలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల అవసరాలను గుర్తించి,వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్,వైస్ ఛైర్పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు,కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్,బర్రె జహంగీర్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్,కౌన్సిలర్లు పాశం అమర్నాథ్,జంగిటి వినోద్,కుక్కదువు పద్మ-సోమయ్య,కో-అప్షన్ సభ్యులు,అధికారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ - జి.శ్రీనివాస్ .✍️
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి