Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మోటకొండూరును నూతన శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి..

Updated : 20 Nov 2026 23:10 IST
As Preferred Source 1 min read
మోటకొండూరును నూతన శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి..

నియోజకవర్గాల పునర్విభజనలో మోటకొండూరుకు ప్రాధాన్యత కల్పించాలి..

మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత

మోటకొండూరు:తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రాన్ని నూతన శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని జాతీయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయవాది పీసరి తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో మోటకొండూరు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మోటకొండూరు మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్న అనేక మండలాలు,గ్రామాలకు భౌగోళికంగా మధ్యస్థానంలో ఉండటంతో పాటు రవాణా సౌకర్యాల పరంగా ఎంతో అనుకూలంగా ఉందన్నారు. జనాభా పరంగా,భౌగోళిక ప్రాధాన్యతతో పాటు అభివృద్ధి పరంగా కూడా మోటకొండూరు కీలక కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు,విద్య,వైద్యం,ఇతర అవసరాల కోసం మోటకొండూరు కేంద్రంగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి,ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించేందుకు మోటకొండూరును నూతన శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో మోటకొండూరు ప్రాంత భౌగోళిక పరిస్థితులు,జనాభా,రవాణా సౌకర్యాలు,ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని నూతన నియోజకవర్గ ఏర్పాటుకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయవాదులు చిర్ర రవీందర్,తండా కృష్ణ గౌడ్,అనంతుల పాండు రంగారెడ్డి,ఆలేటి నాగరాజు,బాల్ద నర్సింహులు,మల్గ అశోక్,రేగు మల్లేష్,భూమండ్ల మురళి,శనిగారం ప్రదీప్,జివిలికపల్లి శ్రీను,బొబ్బల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ -జి.శ్రీనివాస్ .✍️

Sthanikam

మోటకొండూరును నూతన శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి..

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి