ఆందోల్ మండలం చందంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య సీఆర్పీ ట్రైనర్లు స్వప్న, వసంత మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాలతో ఆదాయం పెంచుకునే ఉపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు కుటుంబాల ఆర్థిక అభివృద్ధితో పాటు పేదరిక నిర్మూలనకు కూడా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి మహిళ పొదుపు అలవాటును పెంపొందించుకుని, అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, సీసీ లక్షయ్య, వీఓఏ అనిత, మహిళా సంఘాల అధ్యక్షురాలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి