Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:19 AM

మహానీయుడు జగ్జీవన్ రామ్‌కు ఘణపూర్‌లో ఘన నివాళులు

06-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఘణపూర్ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని ఘణపూర్ గ్రామంలోని ఎమ్మార్పీఎస్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అపార సేవలు చేసిన మహానీయుడు అని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా సేవలందించి అరుదైన రికార్డు సృష్టించారని, కార్మిక, రవాణా, రైల్వే, వ్యవసాయ, నీటిపారుదల, రక్షణ శాఖలతో పాటు ఉప ప్రధానమంత్రిగా పనిచేసి ప్రతి హోదాలో ప్రజలకు నిస్వార్థ సేవలందించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆకుల రాములు, అవుటి హనుమండ్లు, నర్సింలు, జైపాల్ మాదిగ, మనోహర్ మాదిగ, జయరాజ్, యేసప్ప, జగన్, ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షుడు లాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహానీయుడు జగ్జీవన్ రామ్‌కు ఘణపూర్‌లో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News