చౌటుప్పల్ 'విశాల భారతి' పాఠశాలలో అవగాహన సదస్సు
చేతుల్లో ప్లాకార్డులతో విద్యార్థుల భారీ ర్యాలీ
ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి: కరస్పాండెంట్ చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి
మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిని తరిమికొట్టి, డ్రగ్స్ రహిత నవ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని విశాల భారతి పాఠశాల కరస్పాండెంట్ చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లోని విశాల భారతి పాఠశాలలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు "డ్రగ్స్ నిర్మూలిద్దాం... నవ సమాజాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలు రాసిన ప్లాకార్డులతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సమాజంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి