Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’

లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’

లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’
01-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాలుగు లేబర్ కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తూ రాజాపేట మండల కేంద్రంలో కార్మికులు బ్లాక్ డే నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. జనార్ధన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లు కార్మికులను యాజమాన్యాల ముందు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

జిల్లా ఉపాధ్యక్షుడు రేగు శ్రీశైలం మాట్లాడుతూ లేబర్ చట్టాలు, కార్మికుల హక్కులు, స్వేచ్ఛలను హరించే విధంగా ఈ కోడ్‌లు ఉన్నాయని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కార్మికులు కనీస వేతనాలు, సౌకర్యాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 8 గంటల పనిదినాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా కార్మికులను దోపిడీకి గురిచేస్తోందని నాయకులు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో దయ్యాల సిద్ధులు, బుగ్గ నరసింహులు, జూకంటి చంద్రయ్య, ఎర్ర గోకుల రంజిత్, ఎమ్మ బాలరాజు, బుగ్గ కొమురయ్య, బచ్చలి నరసింహులు, ఎమ్మ బీరప్ప, కోయ బాబు, పుప్పాల మల్లయ్య, బైకని బిక్షపతి, బండి సిద్ధులు, మేక ఉపేందర్, గవ్వల బాలయ్య, కాలే నరసింహులు, బండి స్వామి, దయ్యాల రవి, కోయ కృష్ణ, పెద్దోళ్ల కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News