Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: చలకాని వెంకట్ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 09:02 AM

కుక్కడపు వెంకటేశ్వర్లు మృతి బాధాకరం

కుక్కడపు వెంకటేశ్వర్లు మృతి బాధాకరం

కుక్కడపు వెంకటేశ్వర్లు మృతి బాధాకరం
27-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణ పరిధిలోని 26వ వార్డు బీఆర్‌ఎస్ నాయకుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గారు ఇటీవల మరణించగా, బీఆర్‌ఎస్ కోదాడ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఆయనకు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు హాజరై, వెంకటేశ్వర్లు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ కుక్కడపు వెంకటేశ్వర్లు గారి వ్యక్తిత్వాన్ని, పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుక్కడపు వెంకటేశ్వర్లు కల్మషం లేని మనిషి అని, ఎవరిపైనా ద్వేషం కానీ, అసూయ కానీ లేని వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ సమాజ హితాన్ని కోరుకునే వారని, మంచి పని కోసం ఎన్నడూ వెనకడుగు వేయకుండా పోరాడే వారని గుర్తు చేసుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేని క్లిష్ట పరిస్థితిలో, వెంకటేశ్వర్లు గారికి ఉన్న మంచి పేరును బట్టి పార్టీ తరపున ఆయనను కోరడం జరిగిందని తెలిపారు. గెలుపోటములు దైవాధీనమని, పార్టీ విజయం కోసం తాను తప్పకుండా కృషి చేస్తానని ఆయన ఆనాడు ముందుకు వచ్చారని ప్రశంసించారు.

Sthanikam

కుక్కడపు వెంకటేశ్వర్లు మృతి బాధాకరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News