Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: కాసర్ల శ్రీనివాస్ రెడ్డి

Updated : 02 Nov 2026 17:12 IST
As Preferred Source 1 min read
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: కాసర్ల శ్రీనివాస్ రెడ్డి

​మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి మున్సిపల్ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల పరిశీలన పేరుతో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ తీవ్రంగా ఖండించింది.​ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... మచ్చలేని ప్రజా నాయకుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రహదారి విస్తరణ వల్ల ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వపక్షం ఆధ్వర్యంలో పనులను పరిశీలించి, అధికారులతో మాట్లాడటం జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషయాలను తెలుసుకోకుండా, పబ్లిసిటీ కోసం మాజీ ఎమ్మెల్యే హడావుడి చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ​నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల కోసం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా నియోజకవర్గాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తున్నారని కొనియాడారు. మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇప్ప వెంకటేష్, అధికార ప్రతినిధి సామకూర యాదయ్య, ఉపాధ్యక్షులు అంతటి బాలరాజు గౌడ్, వర్కాల కుమార్, చెరుకు రంగస్వామి, ఎండీ వహీద్దీన్, బండమిది మల్లేష్, సెక్రటరీలు గుండెబోయిన ఐలయ్య, ఎండీ పరాజ్, మట్టపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: కాసర్ల శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి