వెల్లంకి: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల గొంతుకగా నిలిచిన నిస్వార్థ తెలంగాణవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా సేవకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను వెల్లంకి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
వెల్లంకి చేనేత సహకార సంఘం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ తెలంగాణ కోసం చేసిన సేవలను పలువురు కొనియాడారు.
కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మిర్యాల ఉపేందర్, ఈడెం శ్రీనివాస్, రావిటి సతీష్, రుద్ర వెంకటేష్, గంజి లక్ష్మయ్య, వనం సత్తయ్య, వనం నరసింహ, వనం పురుషోత్తం, మనం ఉపేందర్, చిక్క బాబురావు, కొంగరి నిరంజన్, అంకం పాండు, చేరిపల్లి శేఖర్‌తో పాటు పద్మశాలి సంఘం సభ్యులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి