జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి. అంజయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా పోరాడారని తెలిపారు. నిస్వార్థ ప్రజాసేవకు, విలువలతో కూడిన రాజకీయ జీవితానికి ఆయన జీవితం గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి