Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 02:11 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం

27-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సామాజిక న్యాయం, సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డిలోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, బాపూజీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ బీసీ, పద్మశాలి, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, వీరశైవ లింగాయత్, కుమ్మరి, కల్లుగీత కార్మిక సంఘాల ప్రతినిధులు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్, అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News