నార్కట్ పల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్ ప్రయాణిస్తున్న అధికారిక వాహనం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తుండగా నార్కట్ పల్లి కామినేని ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. జాతీయ రహదారి–65పై వెళ్తున్న కంటైనర్ వాహనం నిర్లక్ష్యంగా మలుపు తిప్పడంతో అదనపు కలెక్టర్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో అధికారిక వాహనం వెనుక భాగం దెబ్బతింది. అయితే ప్రమాదంలో అదనపు కలెక్టర్‌తో పాటు వాహనంలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్ పల్లి ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి