నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మండల పరిధిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ, విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు, ఎంవీఓ చేతుల మీదుగా అవార్డులతో పాటు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, మంచి విలువలను పెంపొందించేలా మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 22, 2026 09:01 PM
కంగ్టిలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా అవార్డుల అందజేత

22-09-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మండల పరిధిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ, విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు, ఎంవీఓ చేతుల మీదుగా అవార్డులతో పాటు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, మంచి విలువలను పెంపొందించేలా మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి