18 నెలల బకాయి.. రూ.15 లక్షలు చెల్లించకుంటే 30 నుంచి శాశ్వతంగా మూసివేత.
మిర్యాలగూడ: కిరాయి బకాయిలు చెల్లించలేదంటూ మిర్యాలగూడలోని ఈఎస్ఐ ఆసుపత్రి (డిస్పెన్సరీ)కి భవన యజమాని కర్నాటి కృష్ణ శుక్రవారం తాళాలు వేశారు. పాత లలిత టాకీస్ సమీపంలోని భాగ్యలక్ష్మి కాంప్లెక్స్‌లో ఈ ఆసుపత్రి కొనసాగుతోంది. 18 నెలల కిరాయి, విద్యుత్ బిల్లులు కలిపి సుమారు రూ.15 లక్షలు బకాయి ఉన్నాయని కృష్ణ తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 29 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటిలోగా బకాయిలు చెల్లించకుంటే 30 నుంచి శాశ్వతంగా తాళాలు వేస్తామని హెచ్చరించారు.
కిరాయి బకాయిల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఈఎస్ఐ డాక్టర్ నాగేందర్ తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ భవనం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ భవనంలోనే ఆసుపత్రి కొనసాగుతోందని చెప్పారు. ఇక్కడ సుమారు 45 వేల మంది కార్మికులు వైద్య సేవలు పొందుతున్నారని, రోజూ 100–200 మంది రోగులు వస్తున్నారని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి