Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:48 AM

కరాటే ఆత్మరక్షణతో పాటు మెదడును ఉత్తేజపరుస్తుంది

19-04-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేసిన డా. రామ్మూర్తి యాదవ్

విద్యార్థుల ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా వారి మానసిక అభివృద్ధికి కూడా కరాటే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ వైద్యులు, 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ తెలిపారు. ఆదివారం స్థానిక బేబీమూన్ పాఠశాలలో సుమన్ షోటోఖాన్ కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, కరాటే మాస్టర్ జె.వి. రమణ (చిన్న) నేతృత్వంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డా. రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు కరాటే శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరాటే ద్వారా ఆత్మరక్షణ నైపుణ్యాలతో పాటు మెదడు చురుకుదనం పెరుగుతుందని వివరించారు. గత 30 సంవత్సరాలుగా విద్యార్థులకు కరాటే శిక్షణ అందిస్తూ, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న కరాటే మాస్టర్ రమణను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఎల్లో – 9, ఆరెంజ్ – 14, గ్రీన్ – 3, బ్రౌన్ – 15, పర్పుల్ – 3 బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ జె.వి. రమణ, ఆర్. సంతోష్, రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కరాటే ఆత్మరక్షణతో పాటు మెదడును ఉత్తేజపరుస్తుంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News