Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కాంగ్రెస్ వార్డు కమిటీల ఎన్నికలో సమన్వయ లోపం

Updated : 23 Nov 2026 20:31 IST
As Preferred Source 1 min read
కాంగ్రెస్ వార్డు కమిటీల ఎన్నికలో సమన్వయ లోపం

మున్సిపల్ అధ్యక్షుడిపై కాంగ్రెస్ నేత వర్కల రాము గౌడ్ అసంతృప్తి

పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి

​చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న వార్డు కమిటీల ఎన్నికలో సమన్వయ లోపం నెలకొందని ఆ పార్టీ నాయకుడు వర్కల రాము గౌడ్ ఆరోపించారు. మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న వారినే వార్డు అధ్యక్షులుగా ఏకపక్షంగా ఎన్నుకుంటున్నారని విమర్శిస్తూ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ​కాసర్ల శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తుతున్నాయని రాము గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మున్సిపాలిటీ పరిధిలో పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సోమవారం 19వ వార్డులో నిర్వహించిన కమిటీ ఎన్నికలో తనకు ఎక్కువ మంది కార్యకర్తల మద్దతు ఉన్నప్పటికీ, తనను కాదని మరొకరిని ఎన్నుకున్నారని ఆరోపించారు. పార్టీలో ఇలాంటి ఏకపక్ష వైఖరి ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధ్యక్షుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

Sthanikam

కాంగ్రెస్ వార్డు కమిటీల ఎన్నికలో సమన్వయ లోపం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి