Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:25 AM

కాబోయే చైర్మన్‌కు బలమైన మద్దతు – నాగేష్ కుమార్ షేట్కార్ భారీ గెలుపు

14-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నాగేష్ కుమార్ షేట్కార్ 356 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందిన ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు నాగేష్ కుమార్ షేట్కార్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే చైర్మన్‌గా ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారు.విజయం అనంతరం నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 8వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యలు, రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి, దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని, ప్రజల సహకారంతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా సేవాభావంతో ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు.

Sthanikam

కాబోయే చైర్మన్‌కు బలమైన మద్దతు – నాగేష్ కుమార్ షేట్కార్ భారీ గెలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News