Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 05:46 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తరలిరావాలి

01-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ధర్నాను విజయవంతం చేయాలి.. టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాస్‌రావు

సూర్యాపేట జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం కొత్త బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బస్సు పాస్‌లపై ప్రస్తుతం ఉన్న రాయితీని పెంచి 50 శాతం చార్జీలకే ప్రయాణించే అవకాశం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బంటు కృష్ణ, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, సీనియర్‌ జర్నలిస్టులు సుంకరబోయిన వెంకటయ్య, కందుకూరి యాదగిరి, శిగ సురేష్, ఏబీఎన్‌ మల్లేష్, షేక్‌ రషీద్, గుడిపూడి రామకృష్ణ, కందుల నాగరాజు, ఉయ్యాల నరసయ్య, మాదగోని వేణు, పల్లె మణిబాబు, బిగ్‌టీవీ రామకృష్ణ, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న, మహా న్యూస్‌ సురేందర్, దుర్గం బాలు, జహీర్, యోయో టీవీ శంకర్, వల్దాస్‌ శంకర్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తరలిరావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News