Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 AM

ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన అధికారులు

11-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఇంటి పన్ను చెల్లించలేదనే కారణంతో మున్సిపల్ అధికారులు ఓ పేద మహిళ ఇంటి నుండి గ్యాస్ సిలిండర్‌ను తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికంగా నివసిస్తున్న గొలుసుల సుజాత అనే మహిళకు గత నెల 23న ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన వద్ద డబ్బులు లేకపోవడంతో సుజాత పన్ను చెల్లించలేకపోయింది.

దీంతో మున్సిపల్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సుజాత తీవ్ర ఆవేదనకు గురైంది. చివరకు చేసేది లేక అప్పు చేసి రూ.5,280 ఇంటి పన్నును చెల్లించింది.

పన్ను చెల్లించిన అనంతరం అదే రోజు సాయంత్రానికి అధికారులు గ్యాస్ సిలిండర్‌ను తిరిగి ఆమెకు అందజేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పేదలపై ఇలాంటి చర్యలు సరైనవికాదని విమర్శిస్తున్నారు.

Sthanikam

ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన అధికారులు

Article Image

వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఇంటి పన్ను చెల్లించలేదనే కారణంతో మున్సిపల్ అధికారులు ఓ పేద మహిళ ఇంటి నుండి గ్యాస్ సిలిండర్‌ను తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికంగా నివసిస్తున్న గొలుసుల సుజాత అనే మహిళకు గత నెల 23న ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన వద్ద డబ్బులు లేకపోవడంతో సుజాత పన్ను చెల్లించలేకపోయింది.

దీంతో మున్సిపల్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సుజాత తీవ్ర ఆవేదనకు గురైంది. చివరకు చేసేది లేక అప్పు చేసి రూ.5,280 ఇంటి పన్నును చెల్లించింది.

పన్ను చెల్లించిన అనంతరం అదే రోజు సాయంత్రానికి అధికారులు గ్యాస్ సిలిండర్‌ను తిరిగి ఆమెకు అందజేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పేదలపై ఇలాంటి చర్యలు సరైనవికాదని విమర్శిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News