Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఇంటర్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల సంచలన విజయం

13-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఈరోజు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండలోని నారాయణ జూనియర్ కళాశాల అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. విద్యార్థులు సాధించిన అద్భుత మార్కులు కళాశాల ప్రతిష్ఠను మరింత ఎత్తుకు చేర్చాయి.

మొదటి సంవత్సరం ఫలితాలు:

JR-MPC విభాగంలో బి. సింధు, వి. శ్రీ వర్షిత 468/470 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, వి. దేవి శ్రీ, జి. వాగ్దేవి (467/470), జె. తరుణి, ఆర్. మేఘన, పి. రుతిక్, షోయబ్ (466/470) మెరుగైన ప్రతిభ కనబర్చారు.

JR-BiPCలో సిహెచ్. మీనాక్షి (436/440), ఎండి. నుజాహత్ (435/440) అగ్రస్థానాలు దక్కించుకున్నారు. మొత్తం 50 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించడం విశేషం.

రెండవ సంవత్సరం ఫలితాలు:

SR-MPCలో ఎ. సింధు 996/1000 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానం సాధించి కళాశాలకు కీర్తి తీసుకువచ్చింది. ఎ. శ్రీవల్లి 991 మార్కులు సాధించింది.

SR-BiPCలో వి. పూజిత 992/1000 మార్కులతో ప్రతిభ చాటింది. అలాగే 20 మంది విద్యార్థులు 980కు పైగా మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, డీన్, ఏజీఎం, ఏఓ, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల సంచలన విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News