Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 09:58 PM

ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులపై నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్‌

26-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పనిచేయరా.. వెళ్లిపోండి!

సమస్య చెబితే పరిష్కరించాలి.. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు

రామన్నపేట, సెప్టెంబర్ 26 స్థానికం ప్రతినిధి :

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సర్పంచ్లు తమ గ్రామాల్లో నెల కొని ఉన్న సమస్యలు రోడ్లు గుంతల మయంగా మారడంతో పై అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ఆర్ ఆండ్ బీ ఏఈ నవీన్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తున్నావు! పని చేతకాకపోతే వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తమ దృష్టికి తీసుకురావలన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు యుద్ధ ప్రాతి పొదికన రామన్నపేట- అమ్మనబోలు రోడ్డు మరమత్తులు చేపడతామన్నారు.

ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోండి

ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు కార్యాలయాల్లో కూర్చొని వివరాలు తెలుసుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యను పూర్తిగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యపై పూర్తి అవగాహన పెంచుకుని, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలోని సమస్యలను అధికారుల, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఇరిగేషన్‌ అధికారులపై ఫైర్‌

కాల్వల సమస్యలపై సమీక్ష సందర్భంగా ఇరిగేషన్‌ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెబుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి.. పరిష్కారం చూపే బాధ్యత కూడా అధికారులదే అని స్పష్టం చేశారు.ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వల పనులను పూర్తి చేసి కక్కిరేణి, ఇస్కిల్లా గ్రామాలకు ప్రయోజనం కల్పిస్తామని తెలిపారు

రోడ్లకు మహర్దశ

మండలంలోని రోడ్లపై ఉన్న గుంతలను త్వరితగతిన పూడ్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అమన బోలు–రామన్నపేట రోడ్డు పనులకు టెండర్లు, అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జనంపల్లి–కక్కిరేణి పంచాయతీరాజ్‌ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలుగు లైన్ల రహదారి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, ఎంపీడీఓ ఆవుల రాములు, తహసీల్దార్ లాల్ బహుదూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులపై నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News