గడ్డిఅన్నారం, అక్టోబర్ 1: వివేకానందనగర్ బస్తీ దవాఖాన పక్కన ఇళ్లలోకి మురుగునీరు చేరుతుండటంపై మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గురువారం ఆయన క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి, జలమండలి డీజీఎంతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఇళ్లలోకి మురుగునీరు చేరుతున్న తీరును అధికారికి చూపించారు. స్పందించిన డీజీఎం.. డ్రైనేజీ లైన్‌లోని అడ్డంకులను తొలగించి సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా భవానీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు పనుల సమయంలో మట్టికడ్డలు డ్రైనేజీలో పడినా అధికారులు పర్యవేక్షించలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు దుర్వాసన, మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి