Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:17 PM

“ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధిస్తూ లెఫ్టినెంట్‌గా ఆర్మీ అధికారి!.. చిలుముల సుధాకర్ రికార్డు ప్రయాణం”

“ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధిస్తూ లెఫ్టినెంట్‌గా ఆర్మీ అధికారి!.. చిలుముల సుధాకర్ రికార్డు ప్రయాణం”

“ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధిస్తూ లెఫ్టినెంట్‌గా ఆర్మీ అధికారి!.. చిలుముల సుధాకర్ రికార్డు ప్రయాణం”
April 04, 2026 04:21 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహారాష్ట్రలోనినాగపూర్‌లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో జనవరి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన మూడు నెలల కఠిన సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) లో అసోసియేట్ NCC ఆఫీసర్ (ANO) హోదాతో లెఫ్టినెంట్ర్యాంక్‌ను పొందిన చిలుముల సుధాకర్, నాగార్జున ప్రభుత్వ కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. ఆయన ప్రస్తుతం కళాశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ప్రొఫెసర్‌గా విద్యారంగంలో పనిచేస్తూనే, OTAలో జరిగిన తీవ్రమైన ఆర్మీ శిక్షణతో సైనిక అధికారిగా కూడా అవగాహన పెంచుకున్నారు.

శిక్షణ కార్యక్రమంలో ఫైరింగ్, ఆయుధాల హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రాథమిక, నైపుణ్యపూరిత శిక్షణ పొందారు. అలాగే, NCC క్యాడెట్లను భారత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహించడం, వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించడం, NCC యొక్క సైనిక జీవన విధానం, శిస్తు, సామూహిక అనుశాసన వంటి అంశాలపై కూడా ప్రత్యేక శిక్షణ పొందారు.శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ ర్యాంక్‌తో నియమితులైన చిలుముల సుధాకర్, NCC క్యాడెట్లకు శారీరక దృఢత్వం, డ్రిల్, క్రమశిక్షణ, ఆయుధ వినియోగం, ఫైరింగ్ శిక్షణ (Weapon Training & Firing), ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, సివిల్ డిఫెన్స్, విపత్తు నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి సమగ్ర శిక్షణ ఇవ్వడంతోపాటు, దేశభక్తి, జాతీయ సమగ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అదనంగా, ఆర్మీలో చేరడానికి అవసరమైన అవగాహన, ఇంటర్వ్యూ సంసిద్ధత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా క్యాడెట్లకు మార్గదర్శకం అందిస్తారు. ఈ ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా, భవిష్యత్ రక్షణ సిబ్బందిగా రూపుదిద్దాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అంతర్గత నాణ్యతా వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, తెలుగు శాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, వివిధ విభాగాల అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, డా. జ్యోత్స్న, శివరాణి తదితర అధ్యాపకులు చిలుముల సుధాకర్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన భవిష్యత్తులో ఇంకా ఎత్తులు అధిరోహించాలని, విద్యార్థులకు, NCC క్యాడెట్లకు మార్గదర్శకుడిగా మరింత సేవ చేసేలా ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News