Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:45 PM

ఇంద్రపాలనగరాన్ని సందర్శించిన యువ టూరిజం క్లబ్

24-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సెప్టెంబర్ 24: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రాచీన సామ్రాజ్య రాజధాని ఇంద్రపాలనగరాన్ని సందర్శించారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో ఎంతో వైభవంగా వెలుగొందిన ఇంద్రపాలనగరంలోని చారిత్రక కట్టడాలు, శిథిలాలను విద్యార్థులు పరిశీలించి నాటి చరిత్ర, సంస్కృతి, పాలనా విధానాలపై అవగాహన పొందారు.

ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలను విద్యార్థులు సందర్శించాలని సూచించారు. ఆయా ప్రాంతాల చరిత్ర, గత పాలకుల వైభవం, పరిపాలనా విధానాలు, ప్రజల సంస్కృతి, భౌగోళిక పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులకు మరింత అవగాహన కలుగుతుందన్నారు.

యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను పరిరక్షించి, మరింత అభివృద్ధి చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి పాలకులపై ఉందన్నారు. విష్ణుకుండినుల రాజధానిగా ఉన్న ఇంద్రపాలనగరంలోని శిథిల కట్టడాలు నాటి వైభవాన్ని గుర్తు చేస్తున్నాయని తెలిపారు. పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో కళాశాల పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు అమర్, నరేష్, రాంబాబు, కిరణ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరాన్ని సందర్శించిన యువ టూరిజం క్లబ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News