Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

హైదరాబాద్‌లో హైటెక్ మాయాజాలం బట్టబయలు!

హైదరాబాద్‌లో హైటెక్ మాయాజాలం బట్టబయలు!

హైదరాబాద్‌లో హైటెక్ మాయాజాలం బట్టబయలు!
12-04-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన వ్యక్తి కారులో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ మార్పిడి వ్యవస్థ బయటపడింది.

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని కారును పరిశీలించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

సాధారణంగా కనిపించిన ఆ లగ్జరీ కారులో ప్రత్యేకంగా అమర్చిన హైటెక్ సిస్టమ్ పోలీసులను కంగుతినిపించింది. ఒక బటన్ నొక్కగానే వాహన నెంబర్ ప్లేట్ స్వయంచాలకంగా మారిపోవడం గమనించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. క్షణాల్లోనే తెలంగాణ నెంబర్ ప్లేట్ ఢిల్లీ నెంబర్‌గా, మరికొన్ని సెకన్లలో మళ్లీ మారిపోతుండటంతో ఇది ముందస్తుగా పన్నిన కుట్రగా భావిస్తున్నారు.ఈ సాంకేతిక మార్పిడి వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడం, నేరాలకు పాల్పడి గుర్తింపు తప్పించుకోవడం లక్ష్యంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నట్టు అనుమానాలువ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ప్రాథమిక విచారణలో అతను పలుమార్లు నెంబర్ ప్లేట్లు మార్చుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు తేలినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, ఇలాంటి హైటెక్ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ఉన్నదా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

నగరంలో సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని మోసం చేసే ప్రయత్నాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, పౌరులు కూడా ఇలాంటి అనుమానాస్పద వాహనాలపై సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

హైదరాబాద్‌లో హైటెక్ మాయాజాలం బట్టబయలు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News