హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా యాకత్‌పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు నాగరిగారి దేవదాస్ నియమితులయ్యారు.
టీపీసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాళీద్ సైఫుల్లా దేవదాస్‌కు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దేవదాస్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి