Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:36 PM

హక్కుల కోసం జర్నలిస్టుల గళం.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం

02-10-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో జర్నలిస్టులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐబీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టి, వారి ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఆరోగ్య కార్డు సదుపాయాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈ. వెంకటేశం, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ రాహుఫ్, కార్యవర్గ సభ్యుడు హసీబ్ పాటిల్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు హలీం, డివిజన్ అధ్యక్షుడు జీ. సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్యతో పాటు బి. రాములు, జావిద్, జి. విఠల్, అశోక్, నాథేక్, అంజయ్య, జైపాల్ రెడ్డి, రషీద్, వీర రెడ్డి, సంతోష్, నిసార్, రవీందర్, అంబదాస్, రాములు, శ్రీశైలం, వడ్ల వెంకటరమణ, వడ్ల జ్ఞానేశ్వర్, గౌలి మేఘారం, కౌసర్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

హక్కుల కోసం జర్నలిస్టుల గళం.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News