రామన్నపేట మండలంలోని దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఇంద్రపాలనగరం గ్రామాల పరిధిలో గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పల్లివాడ, మునిపంపుల సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, బొడ్డుపల్లి వెంకటేశం కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ ఈఈకి వినతిపత్రం అందజేశారు.రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, రైతులు, ప్రయాణికులకు ప్రమాదాల ముప్పు ఉందన్నారు. వర్షాలు కురిసినప్పుడు గుంతల్లో నీరు చేరడంతో అవి కనిపించక మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గుంతలను పూడ్చడంతోపాటు అవసరమైన చోట రోడ్లకు మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు సురక్షిత రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట తుమ్మలగుడం సర్పంచ్ గర్దాసు విక్రం ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి