భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ - LIAFI 1964) 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చౌటుప్పల్‌లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచ్ ఆఫీసులో సంఘం నాయకులు, సభ్యులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లియాఫీ చౌటుప్పల్ బ్రాంచి అధ్యక్షులు బొడిగె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జెల్లా మల్లేశం, కోశాధికారి గుర్రం సత్యపాల్ మాట్లాడారు. ఏజెంట్ల సంక్షేమం కోసం, ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధి కోసం లియాఫీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు కొండే నరసింహ, పిండి యాదగిరి, బత్తుల కృష్ణ, ఐ.నరసింహ, ఎ.ఏసుదాసు, గంగాధర్, ఎం.మహేష్, ఉస్మాన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 02, 2026 06:41 PM
ఘనంగా ‘లియాఫీ’ ఆవిర్భావ వేడుకలు: ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

02-10-2026
3 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ - LIAFI 1964) 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చౌటుప్పల్‌లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచ్ ఆఫీసులో సంఘం నాయకులు, సభ్యులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లియాఫీ చౌటుప్పల్ బ్రాంచి అధ్యక్షులు బొడిగె లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జెల్లా మల్లేశం, కోశాధికారి గుర్రం సత్యపాల్ మాట్లాడారు. ఏజెంట్ల సంక్షేమం కోసం, ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధి కోసం లియాఫీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ నాయకులు కొండే నరసింహ, పిండి యాదగిరి, బత్తుల కృష్ణ, ఐ.నరసింహ, ఎ.ఏసుదాసు, గంగాధర్, ఎం.మహేష్, ఉస్మాన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి