చిన్నారి శాన్వితకు గ్రామ పెద్దల ఆశీస్సులు.
రామన్నపేట, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కడారి ఐలయ్య–జయమ్మల మనవరాలు కడారి శాన్విత మొదటి జన్మదిన వేడుకలను సోమవారం బోగారం గ్రామంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు హాజరై చిన్నారి శాన్వితను ఆశీర్వదించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, నారపాక యాదయ్య, వర్కల మొగులయ్య, చల్ల భిక్షం యాదవ్, చల్ల అశోక్, కడారి రవి, కొండ వెంకటేశం, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి