రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ పద్మశాలి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆవనగంటి వెంకటమ్మ, తాటిపాముల వనిత, సండ్ల లింగయ్య, జువ్వగొని మల్లమ్మ, మిర్యాల జగన్నాథం, మొగిలి భాగ్యలక్ష్మి, గంజి భాస్కర్, పంచాయతీ కార్యదర్శి మోహన్, ఆశా వర్కర్ ఆవనగంటి సుగుణ, వీవీకే విమల, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, జ్ఞానేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ గిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి